స్పీకర్ అయితే..ప్లీనరీకి రాకుండా ఇంట్లో కూర్చొవాలా? అని ప్రశ్నించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రెండో రోజు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ప్రారంభమైంది. కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలు, ప్రతినిధులతో ప్లీనరీ ప్రాంగణం నిండిపోయింది.
పరిపాలన వికేంద్రీకరణ-పారదర్శకత తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ.. నేను వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యుడిని.. తర్వాతే ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే స్పీకర్‌ని. ప్లీనరీ పండుగ జరుగుతుంటే ఇంట్లో కూర్చొవాలా? అని నిలదీశారు.
రామోజీరావు, ఎబీఎన్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నలు సంధించారు. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా? నేను ప్లీనరీలో పాల్గొంటే తప్పా? అని ప్రశ్నించారు. ఏపీ లో జగన్ మోహన్ రెడ్డి హవా నడుస్తోందని.. వైసీపీ పార్టీ ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని వెల్లడించారు.