జగనన్నని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారే!

-

దుష్టచతుష్టయం…ఇప్పుడు ఈ పేరు వైసీపీ వర్గాల్లో బాగా వినపడుతుంది…తాము ఎన్ని మంచి పనులు చేసిన..తమని చెడుగా చూపించడంలో దుష్టచతుష్టయం బిజీగా ఉందని, ప్రజలకు మంచి చేస్తుంటే…దానిపై కూడా విషప్రచారం చేస్తున్నారని, తాను ఒంటరిని అని, తనని దుష్టచతుష్టయం నుంచి ప్రజలే కాపాడుకోవాలని గత కొంతకాలంగా సీఎం జగన్ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అలాగే దుష్టచతుష్టయం అంటే ఎవరో కూడా జగన్ చెబుతున్నారు….చంద్రబాబు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5.. వీరే తనని నెగిటివ్ చేయడానికి చూస్తున్నారని జగన్ పదే పదే చెబుతూ వస్తున్నారు.

అలాగే మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి వైసీపీ నేతలు వరకు..చంద్రబాబు అండ్ కొ పై ఫైర్ అవుతున్నారు. అయితే జగన్ ప్రతిదానిలోనూ ఈ నాలుగు పేర్లు తీస్తున్నారు…తాను ఏ కార్యక్రమంలో పాల్గొన్న సరే వారి పేర్లు తీయకుండా ఉండటం లేదు..తాజాగా వరద బాధితులని పరామర్శించడానికి వెళ్లినప్పుడు కూడా జగన్ అదే ప్రస్తావన తెచ్చారు. తాను మంచి చేస్తున్నా సరే…ఆ నలుగురు తనని నెగిటివ్ చేస్తున్నారని, ఎప్పుడూలేని విధంగా కొన్ని మీడియా సంస్థలు…ఒక వ్యక్తిని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు.

అంటే టీడీపీ అనుకూల మీడియా…చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తుందని జగన్ చెబుతున్నారు. అయితే జగన్ ఈ స్థాయిలో టీడీపీ అనుకూల మీడియా గురించి మాట్లాడుతున్నారంటే…అంత స్థాయిలో ఆ మీడియా…జగన్ ని ఇబ్బంది పెడుతుందా? అనే డౌట్ కూడా వస్తుంది. ఆ మీడియా వల్లే సగం నెగిటివ్ పెరుగుతుందని భావిస్తున్నట్లున్నారు.

వాస్తవానికి జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు బాగా చేస్తుంది…కానీ అభివృద్ధి విషయంలో వెనుకపడింది…అలాగే ప్రజలపై పన్నుల భారం పెంచింది…చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలో పలు లోపాలు ఉన్నాయని, వాటిని టీడీపీ అనుకూల మీడియా బాగా హైలైట్ చేస్తుంది…దాని వల్లే జగన్ కు నెగిటివ్ పెరుగుతున్నట్లు ఉంది..కాకపోతే పూర్తిగా మంచి చేస్తూ…టీడీపీ అనుకూల మీడియా మీద విమర్శలు చేస్తే పర్లేదు..అలా కాకుండా ప్రభుత్వంలో కొన్ని తప్పులు పెట్టుకుని, పైగా తమకు సొంత మీడియా, అనుకూల మీడియా లేనట్లు జగన్ వన్ సైడ్ గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనే భావన ప్రజల్లో వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా గాని టీడీపీ అనుకూల మీడియా జగన్ ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news