ఈరోజు చుక్కల అమావాస్య.. పితృదేవతలకు తర్పణాలు వదులుతున్నారా..?

-

ఈ రోజుతో ఆషాడ మాసం ముగుస్తుంది. ఆషాడం చివరిరోజున చుక్కల అమావాస్య అంటారు. ఈరోజున పితృదేవతలను తల్చుకుని తర్పణాలు వదలడం హిందువులు ఆచారం.. ఇంకా ఈ అమావాస్య ప్రత్యేకతలేంటంటే..!

ఈ చుక్కల అమావాస్య రోజు..చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం శ్రాద్ధకర్మలు చేస్తారు. పెద్ద ఎత్తున అన్నదానాలు చేస్తుంటారు. ఆహారం, బట్టలు పెదవారికి దానంగా ఇస్తుంటారు. మరికొందరు ఆషాడ మాసం చివరి రోజున గంగా స్నానాలు కూడా చేస్తుంటారు. దీపాలను నదులలో వదులుతారు. నీటిలో తమ వారి పేరు మీద వదిలిపెట్టే దీపాలు, తమ వారికి పుణ్యలోకాలకు దారిచూపిస్తాయని హిందువుల నమ్మకం.

కొందరు ఆషాడ అమావాస్య రోజున గౌరీ దేవిని పూజించడం మంచినదని నమ్ముతుంటారు. పసుపును ముద్దగా చేసి గౌరి దేవీని పూజిస్తారు. పెళ్లి కావాలని కోరుకుంటారు. అదే విధంగా.. అమావాస్య రోజు చేసే జప, ధాన ధర్మాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు.

కొంత మంది మట్టితో దీపం తయారు చేసి పూజిస్తుంటారు. కొత్త కోడళ్లు నోము నోస్తారు. ఇదే రోజున కొంత మంది దీప పూజ కూడా చేస్తుంటారు. ఆషాడంతో సూర్యుడు దక్షిణాయనంలోకి మారతాడు. చీకటి అనేది అజ్ఞానానికి అనారోగ్యానికీ చిహ్నం. దాన్ని పారద్రోలేందుకు దీపపూజ చేస్తారని పండితులు అనేమాట.

కొందరు ఈ రోజు చనిపోయిన తమ బంధువుల పేరుమీద దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తారు. నదుల దగ్గర కొందరు దానాలు కూడా ఇస్తుంటారు. బ్రాహ్మణులకు భోజన, తాంబులాలు ఇవ్వడం మంచిదట.. మరికొందరు ఆ రోజున ఉపవాసాలు కూడా చేస్తారు.. ఈ విధంగా చేయడం వలన పొయిన తమ వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తయని భావిస్తుంటారు.

అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణం ప్రారంభమవుతుంది. మంచి మూహుర్తాలు కూడా ఉంటాయి. ఇక ఇదే నెలలో పెళ్లిళ్లు, పండుగలు చాలా ఉన్నాయి. ఆగస్టులోనే వినాయచవితి, రక్షాబందన్‌, జన్మాష్టమీ, స్వతంత్యదినోత్సవం అబ్బో ఈ నెలంతా ఫుల్‌ హడావిడి ఉంటుంది. కోడళ్లు పుట్టింటి నుంచి మళ్లీ అత్తగారింటికి వస్తారు. బ్రేక్‌ ఇచ్చిన పెళ్లిళ్లు షురూ అవుతాయి..!

Read more RELATED
Recommended to you

Latest news