ఆ సూపర్ హిట్ మూవీ స్టోరీ పవన్ ను ఊహించుకుని రాసుకున్నా: శేఖర్ కమ్ముల

-

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2004లో వచ్చిన ఫీల్గుడ్ మూవీ ‘ఆనంద్’. అప్పట్లో ఎలాంటి హడావుడి లేకుండా విడుదల అయిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.ఇప్పుడు పవన్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లా చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమా స్టోరీని పవన్ కళ్యాణ్ని దృష్టిలో ఉంచుకుని రాసినట్లు శేఖర్ కమ్ముల అన్నారు. అయితే కథ చెప్పేందుకు పవన్ను సంప్రదించలేదని తెలిపారు. ఆనంద్..మంచి కాఫీలాంటి . ఈ మూవీని పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నారు శేఖర్ కమ్ముల.ఈ మూవీలో హీరోగా రాజా నటించారు. ఇక ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా సదాను అనుకున్నప్పటికీ కమలినీ ముఖర్జీ కథానాయిక పాత్రను పోషించారు.2004 అక్టోబర్ 15న విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా లోని సాంగ్స్ కూడా ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటాయి.

శేఖర్ కమ్ముల తెలుగు సినీ పరిశ్రమలో అందమైన చిత్రాలను అందించి తనకంటూ ఓ గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన సినిమా లు కమర్షియల్ హిట్ కాకపోయినా.. అభిమానుల హృదయాలను తాకుతాయి. యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి.ప్రస్తుతం శేఖర్ కమ్ముల కుబేరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కింగ్ నాగార్జున, తమిళ నటుడు ధనుష్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version