బాలయ్య తాజాగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి అలాగే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ కూడా సంక్రాంతి పండుగ బరిలో పోటీ పడబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో నిర్వహించాలని అధికారికంగా ప్రకటించారు. కానీ స్టార్ హీరో బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే జనాలు భారీగా వస్తారు. దాంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వేదికను మార్చుకోవాలి అంటూ పోలీసులు చిత్ర యూనిట్‌కు తెలియజేశారు.
ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదాలు నెలకొన్నాయి వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అడ్డుకుంటున్నారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏబీఎన్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ ఫ్రా లో ఈవెంట్ ను నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు . ఇప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్ అర్జున్ ఇన్ ఫ్రా ను వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికైతే బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇదే సమయంలో మరి చిరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతేంటి? ఆ వేదిక ఎక్కడ? అని చిరు అభిమానులు ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే భయపడాల్సిన అవసరం లేదని త్వరలోనే ఆ వేదిక కూడా ప్రకటిస్తాము అని ఏపీ ప్రభుత్వ పోలీసులు స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే ప్రజల పనులకు అవాంతరాలు కలగకుండా పోలీసులు ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చే అభిమానులను అదుపు చేయడం సాధ్యమైన పని కాదు. అలాంటి సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వేదికను మార్చినట్లుగా స్పష్టం చేశారు ఏపీ పోలీసులు.