కళ్ల కింద ‘డార్క్​ సర్కిల్స్​’ పోవడానికి సూపర్ చిట్కాలు..

-

ఎవరినైనా మిమ్మల్ని ఎదుటివారిలో మొదటగా ఆకర్షించేది ఏంటని అడిగితే టక్కున కళ్లు అని చెప్పేస్తారు. ఎన్నో భావాలను పలికించే ఈ కళ్లు ఎంత అందంగా ఉంటే అంతగా మీరు ఇతరులను ఆకర్షిస్తారు. అయితే ఇప్పుడున్న జనరేషన్ ని వేధిస్తున్న సమస్య ఏంటంటే.. కళ్ల కింద నల్లటి వలయాలు. సరిగ్గా నిద్రపోకవడం.. రాత్రిళ్లు మేలుకొని ఉండటం.. గంటల తరబడి ఫోన్, ల్యాప్ టాపుల్లో తల దూర్చడం ఇలా అనేక రకాల కారణాలతో కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. మరి వీటికి విరుగుడు లేదా అంటే ఉందంటున్నారు డెర్మటాలజిస్ట్ లు. కంటి కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి.. వాటిని తొలగించుకోవడం ఎలాగో కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

కళ్ల చుట్టూ నల్లగా ఉండడం అనేది చాలా సహజమైన సమస్య. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

  • రక్త లేమి కారణంగా కళ్ల చుట్టూ నల్లటి చారలు వచ్చే అవకాశముంది.
  • చర్మం పొడిగా ఉన్నవారి కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ రావచ్చు.
  • కొందరికి కంటి చుట్టూ ఉన్న చర్మం ఎప్పుడూ దురదగా ఉంటుంది. అలాంటి వాళ్లు పదేపదే కళ్లు నలుపుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా కళ్ల చుట్టూ నల్లగా మారే అవకాశముంది.
  • కొంత మంది లావుగా ఉన్నవారిలో మెడ చుట్టూ, కళ్ల చుట్టూ నల్లగా ఉంటుంది.
  • నిద్ర లేమి మరో కారణం. నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు, ఎక్కువ సేపు కంప్యూటర్, టీవీ చూసేవాళ్లకు కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి.
  • కొందరికి కళ్ల చుట్టూ ఉన్న చర్మం పల్చగా ఉంటుంది. దాని కింద ఉన్న రక్త నాళాలు బయటకు కనిపించి, నల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది.
  • మరికొందరికి కళ్లు లోతుగా ఉంటాయి. అలాంటి వారిలో కళ్ల చుట్టూ నీడ పడి డార్క్ సర్కిల్స్​లా కనిపిస్తాయి.

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. వీటిని బట్టి వైద్యులు వేర్వేరు చికిత్సా విధానాలు అవలంబిస్తారు. అన్నింటికీ ఒకటే వైద్యం సరిపోదు.

  • కళ్ల చుట్టూ చర్మం దురదగా ఉన్నవారు.. ఆ సమస్యను తగ్గించుకునేందుకు, కళ్లు నలుపుకోకుండా చూసేందుకు ప్రయత్నించాలి.
  • పొడి చర్మం ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
  • పిగ్మెంటేషన్​ పోగొట్టే క్రీమ్స్​ ఉంటాయి. వాటిని రోజూ పగలు, రాత్రి రాసుకోవాలి. సన్​స్క్రీన్​ లోషన్​ వాడుతూ ఉండాలి.
  • ఎనీమియా ఉంటే ఆ సమస్యను పోగొట్టుకునేందుకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.
  • టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోకుండా చక్కగా నిద్రపోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version