ఆయన చేతిలో ఉన్న రాజ్యాంగం చైనాదే :అస్సాం సీఎం

-

అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మరోసారి రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఎరుపు రంగు రాజ్యాంగాన్ని ప్రదర్శించారు.దీనిపై అస్సాం సీఎం మాట్లాడుతూ.. ఆయన ఎన్నికల ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ”భారత రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీ నీలి రంగులో ఉంటుంది .నిజమైన చైనా రాజ్యాంగానికి ఎరుపు రంగు ఉంటుంది. రాహుల్ చైనా రాజ్యాంగాన్ని కలిగి ఉన్నాడా..? మేము ధ్రువీకరించాల్సి ఉంటుంది” అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

రాజ్యాంగ నిర్దేశిక సూత్రాల్లో యూనిఫాం సివిల్ కోడ్ ఉంది. దానిని అమలు చేయడం మన పవిత్ర విధి. అయితే దీనిని వ్యతిరేకిస్తున్నటువంటి రాహుల్ గాంధీ చేతిలో ఉన్న రాజ్యాంగం తప్పనిసరిగా చైనాదే అని అనుకుంటున్నాను” అని అన్నారు.ఇదిలా ఉంటే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు సీఎం హిమంత బిశ్వ శర్మ ధరించిన ఎరుపు కండువాను ఎత్తి చూపారు. రాజ్యాంగానికి రంగు లేదని, ముఖ్యమంత్రి ఎరుపు రంగు ఖండువా ధరిస్తారు, అది కూడా చైనాదేనా, ఇది సరైంది కాదు అని ఎమ్మెల్యే హఫీజ్ రఫీకుల్ ఇస్లాం ఎద్దేవ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version