సీఎం రేవంత్ ప్లేటు భోజనం ఖరీదు రూ.32వేలు.. బిల్లు కట్టాలని ఆ టెంపుల్‌కు ఒత్తిడి!

-

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాల సభకు విచ్చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనతో పాటు పలువురు ప్రముఖులకు తాజ్ కృష్ణ నుంచి భోజనాలు తెప్పించారు. ఇతర ఖర్చులు అన్నీ కలిపి బిల్లు ఏకంగా రూ.1 కోటి 70 లక్షలు అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ప్లేటు భోజనం ఖరీదు రూ.32 వేలుగా హోటల్ యాజమాన్యం కోట్ చేసింది. సీఎం సహా 100 మందికి భోజనాల ఖర్చు రూ.32 లక్షలు అయ్యాయి.

దీంతో రూ.32 లక్షలు చెల్లించాలని వేములవాడ రాజన్న ఆలయానికి హోటల్ యాజమాన్యం బిల్లులను పంపినట్లు సమాచారం.డబ్బులన్నీ ఆలయం నుండే కట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఇంత మొత్తం కట్టలేమన్న రాజన్న ఆలయ అధికారులు తేల్చిచెప్పడంతో జిల్లా కలెక్టర్ దగ్గరికి పంచాయితీ చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో సీఎం సహా ఇతరుల ఫుడ్ కోసం చేసిన ఖర్చులను భక్తుల సమర్పించిన కానుకల ద్వారా సమకూరిన ఆదాయం నుంచి ఎలా చెల్లిస్తారని రాజన్న భక్తులు ఫైర్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version