Breaking: పెళ్లి పీటలెక్కనున్న స్టార్ డైరెక్టర్ కూతురు

-

బాలీవుడ్‌ ఇండస్ట్రీ అన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో విమర్శలను పట్టించుకోకుండా తమకు నచ్చిన జీవితాన్ని తామే ఎంచుకుంటారు. సినీ దర్శకత్వంలోనూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ప్రేక్షకులకు సినిమాల్లో కొత్తదనం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి దర్శకుల్లో అనురాగ్ కశ్యప్ కూడా ఒకరు. అందుకే ఇతర దర్శకులతో పోల్చుకుంటే.. అనురాగ్ డైరెక్ట్ చేసిన సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అయితే, తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ కూతురి సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

ఆలియా కశ్యప్

డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ రెండేళ్లుగా ప్రేమలో ఉంది. షేన్ గ్రెగోయిర్ అనే యువకుడితో పీకల్లోతులో ప్రేమలో మునిగి తేలుతోంది. వీరు మొదట్లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరు జీవితాంతం కలిసి ఉండాలని డిసైడ్ అయ్యారు. దీంతో రెండేళ్లుగా వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ తమ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. త్వరలో వీరిద్దరూ పెళ్లిపీటలెక్కనున్నట్లు బాలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version