ఇక పై వాటికి దూరం అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రముఖ నటుడు..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మాజీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కెరియర్ మొదట్లో హీరోగా సినిమాలు చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరికి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరును సంపాదించుకున్న బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియా వేదిక ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ పలు వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాడు.గతంలో హైదరాబాద్ లో తీవ్రమైన వరదలు రావడంతో బ్రహ్మాజీ కూడా పడవ కావాలి అంటూ చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. ఇక ఎంతో మంది నెటిజన్లు కూడా బ్రహ్మాజీ నీ దారుణమైన ట్రోల్స్ తో కామెంట్ చేశారు. ఇకపోతే ఇటీవల పలు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బ్రహ్మాజీ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక దాగిఉన్న కారణం తెలియక పోయినప్పటికీ.. ఆయన అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారు. ఇక అసలు విషయం తెలియదు కానీ ప్రస్తుతం బ్రహ్మాజీ సోషల్ మీడియా కు కొద్ది రోజుల పాటు దూరంగా ఉండబోతున్నానని ప్రకటించాడు.

ఇక బ్రహ్మాజీ ఇలా సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతోన్నాము అని ప్రకటించడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు షాక్ అయ్యారు . ఇలా ఒక్కసారిగా నిర్ణయం తీసుకోవడం ఏంటి అంటూ ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇకపోతే బ్రహ్మాజీ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయన అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version