ప్రభుత్వం పంట కొనడం లేదని.. ప్రైవేటుకు అమ్ముతున్న రైతులు

-

తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు చేయడంలేదని రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. రూ.1000 నష్టానికి పత్తి పంటను అమ్ముకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం బయటకు చెబుతున్నదానికి చేస్తున్న దానికి అస్సలు పొంతన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐలో పత్తి పంట అమ్ముదామని వెళితే..తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండాలని కారణం చూపుతూ అధికారులు పంటను కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

దీంతో చేసేదేమీలేక రైతులు ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుంటున్నట్లు సమాచారం.కేంద్రం పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 ప్రకటించగా, ప్రైవేటు వ్యక్తులు క్వింటాల్‌కు రూ.6,400-6,500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజులు పత్తిని ఆరబెట్టినా సీసీఐలో కొనడం లేదని..చేసేదేమీ లేక తక్కువ ధరకు ప్రైవేటుకు అమ్ముకుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version