ఈ రోజుల్లో పాస్‌వర్డ్ పెట్టుకోకుండా ఫోన్ వాడేవాళ్లు ఉంటారా..? ఫోన్ లాక్ కి ఒక పాస్‌వర్డ్ , గ్యాలరీకి ఒకటీ, కాంటాక్ట్స్ కి ఒకటీ.. ఇంతేనా.. మెయిల్ పాస్‌వర్డ్ , సిస్టమ్ పాస్‌వర్డ్ . అరే అసలు ఏం ఓపెన్ చేయాలన్నా ఐడీతో పాటు పాస్‌వర్డ్ కావాలి.. అది కూడా స్పెషల్ క్యారెక్టర్స్, లెటర్స్ ఉండాలి.. అసలు ఇదంతా పెద్ద లొల్లి అనిపిస్తుంది కదా.. మనకా అన్నీ గుర్తుకు ఉండవాయో.. సరే అన్నింటికి కలిపి ఒకటే పాస్‌వర్డ్ పెడితే.. ఈజీగా సైబర్ నేరాగాళ్ల చేతిలో చిక్కకోవాల్సిందే.. ఆ క్షణానికి ఏదో ఒకటి పెట్టేస్తాం.. మళ్లీ ఓపెన్ చేయాలంటే పాస్‌వర్డ్ గుర్తుకురాదు. ఏముంది ఫర్గెట్ కొట్టేస్తే కథ మళ్లీ మామూలే.. ఈ ప్రాబ్లమ్ లేకుండా.. పాస్‌వర్డ్ లేని ప్రపంచం ఉంటే.. భలే ఉంటుంది కదా..!
రానున్న కాలంలో అసలు పాస్‌వర్డ్స్ లేని ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, వెబ్ బ్రౌజర్లలో పాస్‌వర్డ్ అవసరం లేకుండా సైన్-ఇన్ చేసుకునేందుకు ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ పాస్‌వర్డ్ లేని సైన్-ఇన్ ఎఫ్‌ఐడీఓ అలయెన్స్‌కు, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియానికి కట్టుబడి ఉండనుంది.
ఐఓఎస్, ఆండ్రాయిల్ మొబైల్ డివైజ్‌లు, సఫారి, క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్స్, విండోస్, మ్యాక్ ఓఎస్ డెస్క్‌టాప్‌లు వంటి పలు ప్లాట్‌ఫామ్‌లపై పాస్‌వర్డ్ అవసరంలేని అథెంటికేషన్‌ను త్వరలోనే తీసుకొస్తున్నట్లు ఈ మాడ కంపెనీలు ప్రకటించాయి.
కేవలం పాస్‌వర్డ్ అథెంటికేషన్ వల్లనే అనేక సెక్యూరిటీ తలనొప్పులు ఏర్పడుతున్నాయని ఆపిల్ సంస్థ చెప్చోంజియ. ప్రతి దగ్గర పాస్‌వర్డ్ వాడాల్సి వస్తుండటంతో గుర్తుంచుకోలేక చాలా మంది యూజర్లు అన్ని డివైజ్‌లకు ఒకే పాస్‌వర్డ్‌ను వాడుతున్నారని.. ఇది డేటా దొంగతనాలకు, సెక్యూరిటీ ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతుందని సంస్థ పేర్కొంది. పెరుగుతోన్న సెక్యూరిటీ సమస్యలతో.. ఈ మేజర్ టెక్ కంపెనీలన్నీ సైన్-ఇన్ టెక్నాలజీని రూపొందించేందుకు కలిసికట్టుగా సాగుతున్నాయి.
ఈ టెక్నాలజీ త్వరగా అందుబాటులోకి వస్తే.. ఎంతో మంది యూజర్లకు రిలీఫ్ గా ఉంటుంది. ఈ పాస్‌వర్డ్‌స్ పెట్టి పెట్టి విసిగెత్తిపోయి ఉన్నారు అసలే.. అవునూ.. మీదీ ఇదే పరిస్థితేనా..!
-Triveni Buskarowthu