ఐదు పదుల వయసులోనూ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ ‘లెజెండ్’ సినిమాలో నటించారు బిజినెస్ మ్యాన్ శరవణన్. అయితే ఈ మూవీ తర్వాత ఎన్నో ట్రోల్స్ ఆయనపై వచ్చినప్పటికి అవన్నీ లెక్కచేయకుండా మరో సినిమాకు సిద్దమవుతున్నారని తెలిసింది. ఆ వివరాలు..
తమిళనాడుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్..’లెజెండ్’ అనే చిత్రంతో వెండితెరపైకి అరంగేట్రం చేశారు. ఐదు పదుల వయసులోనూ స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గనంటూ ఆ సినిమాలో నటించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత శరవణన్పై ఎన్నో ట్రోల్స్ సైతం నెట్టింట్లో హల్చల్ చేశాయి. భారీ నష్టాలతో పాటు విమర్శలను ఎదుర్కొన్న శరవణన్ ఇక తెరపైకి రారని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను తిప్పికొడుతూ తాజాగా శరవరణన్ మరో సినిమాకు సిద్దమవుతున్నట్లు సమాచారం.
కోలీవుడ్ వర్గాల ప్రకారం.. త్వరలోనే ఆయన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారని, ఈ సారి ఏకంగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో చర్చలు జరిపి, కథను ఫైనల్ చేశారట. త్వరలోనే గ్రాండ్గా అనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. అన్నట్లు.. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమేనట.