తమ్ముళ్ళ రచ్చ రచ్చ..బాబుని లెక్క చేయట్లేదు..!

-

ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకుంది..సీటు కోసం తమ్ముళ్ళ మధ్య పోరు నడుస్తోంది. సర్దుకోవాలని, కలిసి పనిచేయాలని చంద్రబాబు చెప్పినా సరే..ఆయన మాట లెక్క చేయకుండా ఎక్కడకక్కడే కుమ్ములాటలకు దిగుతున్నారు.  తాజాగా రెండు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు కొట్టుకునే వరకు వెళ్లిపోయారు. సీటు విషయంలో క్లారిటీ లేకపోవడంతో..సీటు కోసం పోటీ పడి..ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే దిశగా వెళుతున్నారు.

తాజాగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరీ వర్గాల మధ్య గొడవ జరిగింది. కుర్చీలు లేపి కొట్టుకున్నారు. గత ఎన్నికల్లో చౌదరీని కాదని, ఉమాకు సీటు ఇచ్చారు. వైసీపీ వేవ్‌లో ఉమా ఓడిపోయారు..ఓడిపోయాక ఇంచార్జ్ గా పనిచేస్తూ..పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయనకు వ్యతిరేకంగా చౌదరీ వర్గం సెపరేప్ట్ గా పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. ఈ రచ్చకు బ్రేకు వేయాలని పలుమార్లు నేతలకు చంద్రబాబు సూచించారు. కానీ బాబు దగ్గర ఊ కొట్టి, నియోజకవర్గానికి వచ్చి గొడవ పడుతున్నారు.

కళ్యాణదుర్గంలో రచ్చ తర్వాత సత్తెనపల్లిలో రచ్చ జరిగింది..సత్తెనపల్లిలో టీడీపీ కన్వీనర్ల ఎంపికకు సంబంధించి సమావేశం జరగగా, ఆ సమావేశంలో ఇంచార్జ్ పదవి కోడెల శివరాంకు ఇవ్వాలని..ఆయన అనుచరులు రచ్చ లేపారు. అదే సమావేశంలో వైవీ ఆంజనేయులు వర్గంపై విరుచుకుపడ్డారు. వైవీ నాన్ లోకల్ అని, ఆయన మాటలు వినకూడదని అక్కడకు వచ్చిన టి‌డి‌పి పరిశీలకులకు వార్నింగ్ ఇచ్చారు.

అలాగే కుర్చీలు గాల్లోకి విసిరి కాసేపు హడావిడి చేశారు..దీంతో పరిశీలకులు సీరియస్ అయ్యి..కోడెలని తన అనుచరులని బయటకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కోడెల శివరాం..తన అనుచరులతో బయటకెళ్లిపోయారు. సత్తెనపల్లి సీటు కోసం చాలామంది ట్రై చేస్తున్నారు. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు, నాగోతు శౌరయ్య, మన్నెం శివనాగమల్లేశ్వరావు, రాయపాటి రంగబాబు..ఇలా చాలా మంది సీటు కోసం ట్రై చేస్తున్నారు. కానీ బాబు ఎవరికి ఫిక్స్ చేయలేదు. రెండు స్థానాల్లో కూడా అదే పరిస్తితి. అందుకే తమ్ముళ్ళు రచ్చ రచ్చ లేపుతున్నారు. దీని వల్ల టీడీపీకే డ్యామేజ్ జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version