బరువు తగ్గేందుకు నెంబర్‌ వన్‌ ఫ్రూట్‌.. తగ్గాలంటే తినాల్సిందే..!

-

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి.. ఏం చేసినా పెద్దగా ప్రయోజనం లేదని ఫీల్‌ అవుతున్నారా..? అయితే ఈ ఒక్క ఫ్రూట్‌ తినండి చాలు.. మీకు కావాల్సినంత బరువు తగ్గొచ్చట. చూసేందుకు అచ్చం జామకాయలా కనిపిస్తుంది. దాని పేరు గార్సినియా కంబోజియా. దీన్ని మలబార్ చింతపండు అని కూడా అంటారు. ఇదొక ఉష్ణమండల పండు. బరువు తగ్గించేందుకు పురాతన కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఆగ్నేసియా, భారత్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండే ఉష్ణమండల పండు. ఇది జీవక్రియ రేటుని వేగవంతం చేసి బరువును తగ్గిస్తుందట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పండుని బరువు తగ్గించే సప్లిమెంట్లు, మందుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.

గార్సినియా కాంబోజియా పండు తొక్కలో శక్తివంతమైన సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులోని హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుందట. కొవ్వుని ఉత్పత్తి చేయకుండా అడ్డుకుంటుంది. వేగవంతమైన జీవక్రియని ప్రోత్సహిస్తుంది.

అసలు HCA అంటే ఏంటి?

హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ ఒక క్రియాశీల సమ్మేళనం. ఇన్సులిన్ నిర్వహణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. గార్సినియా తీసుకుంటే ఆకలి తగ్గుతుందని తేలింది. హెచ్సీఏ మెదడులో సెరోటోనిన్ స్థాయిలని పెంచుతుందని అధ్యయనాలు నిరూపించాయి. ఆకలిని నియంత్రించడం వల్ల తక్కువ కేలరీలు తీసుకోవడంలో ప్రోత్సహిస్తుంది.

కొవ్వు రాకుండా చేస్తుంది

హెచ్సీఏ సిట్రేట్ లైట్ అనే ఎంజైమ్ ని అడ్డుకుంటుంది. ఈ ఎంజైమ్ నిరోధించడం వల్ల కార్బోహైడ్రేట్ ను కొవ్వుగా మారుస్తుంది. కొవ్వు ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా కొవ్వు ఏర్పడకుండా శరీరంలోని కొవ్వుని విధులకి ఉపయోగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులని తగ్గిస్తాయి. ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లని నివారించడంలో సహాయపడుతుంది. ఎర్ర రక్తకణాల సంఖ్యని పెంచుతుంది.బరువు తగ్గించేందుకు గార్సినియా మంచిదని అద్భుతమైన పండుగా పని చేస్తుందని చెప్తూ ఉంటారు. అయితే దీని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం దీన్ని అధికంగా తీసుకోవడం అంతగా సురక్షితం కాదని చెప్తుంటారు.

సైడ్‌ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..

2017లో ఎఫ్ డీఏ బరువు తగ్గించుకునే వాళ్ళు గార్సినియా పండు తీసుకోవడం మానేయాలని హెచ్చరించారు. ఇది తీసుకోవడం వల్ల తీవ్రమైన కడుపులో అసౌకర్యం, కాలేయ సమస్యలు వచ్చాయని నివేదించారు. అతిసారం, తలనొప్పి, చర్మం మీద దద్దర్లు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటివి వస్తే.. వెంటనే ఆ పండు తినడం మానేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news