ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని పలుమార్లు పలువేదికలపై ప్రకటించారు.అయితే, ప్రభుత్వం ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయ్యింది. అయినప్పటికీ ఆరు గ్యారెంటీలు ఎక్కడా అమలు కాలేదని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ..ఆరు గ్యారంటీలలో మిగిలిన హామీలను రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాలలో అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై అటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సైతం గుర్రుమంటున్నాయి. అధికారంలోకి వచ్చేంత వరకు ఒక మాట.. వచ్చాక ఒక మాట మాట్లాడటం, జనాలను, రైతులను మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.