ఐదు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్‌తో మిగిలిఉన్న మూడు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ శనివారం ఉదయం 17 మంది సభ్యులతో జట్టు ప్రకటించింది. అయితే శ్రేయస్ అయ్యర్‌ను ఇందులో చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. వైజాగ్ టెస్టు సందర్భంలో తనకు మళ్లీ వెన్ను నొప్పి బాధపెడుతుందని సెలక్టర్లకు అయ్యర్ చెప్పినట్టు వార్తలు వినిపించాయి. గాయం కారణంగానే అయ్యర్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారని తెలుస్తుంది. టెస్టులలో అయ్యర్ వరసగా ఫెయిల్ అవుతుండడంతో సెలక్టర్లు ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు వేటు వేసినట్టు తెలుస్తోంది. అంతేగాక ఇదే ఆట తీరును ప్రదర్శిస్తే భవిష్యత్తులో అయ్యర్ను జట్టులో చేర్చుకోవడం కష్టమని ఇప్పటికీ బీసీసీఐ అతనికి తేల్చి చెప్పిన్నట్లు సమాచారం.
ఇదే విషయమై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ… ‘ఒకవేళ అయ్యర్‌కు గాయమైతే బీసీసీఐ మెడికల్ బులిటెన్ విడుదల చేసి గాయంపై అప్డేట్ ఇచ్చేది అని అన్నారు.అలా చేయలేదంటే దాని అర్థమేంటి..? అయ్యర్‌పై వేటు పడింది..’ అని ఆయన చెప్పడం గమనార్హం. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికగా జరిగిన రెండు టెస్టులలో అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. గత రెండు టెస్టులలో 35, 13, 27, 29 స్కోర్లు మాత్రమే చేశాడు.