హైదరాబాద్ అభివృద్దిలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే కు ఉప్పర్ పల్లి లో అధనపు ర్యాంపులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సభితా, ఎంపీ అసదూద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, సీఎస్ సోమేష్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ పాల్గొన్నారు. మెహదీపట్నం నుంచి రాజేంద్రనగర్ వరకు 11.6 కి.మీ పొడువుగా ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే కి…
నూతనంగా రూ.22 కోట్లతో అధనంగా కింద, పైన ర్యాంపుల నిర్మించారు. మెహదీపట్నం నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో పిల్లర్ నెం. 161 వద్ద ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కేలా ఒకటి అలాగే ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ వద్ద దిగేలా పిల్లర్ నెం. 163 దిగేందుకు ఈ ర్యాంపులను నిర్మించారు. ఈ ఎక్స్ ప్రెస్ వేకు గతంలో ఇరువైపుల ఎక్కి, దిగేందుకు 6 ర్యాంపులు ఉన్నాయి.