నటరత్న..నందమూరి నటసింహం బాలకృష్ణ..సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్నే కాదు..రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు. హిందూపూర్ శాసన సభ్యుడిగా, ప్రముఖ సినీ హీరోగా ఆయన ఫుల్ బిజీగా తన లైఫ్ కొనసాగిస్తున్నారు.
ఫేమస్ రైటర్ కొండలరావు..‘భైరవ ద్వీపం’ ఫిల్మ్ స్టోరి రాయగా, దీనిని తొలుత బాలయ్యకు వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చింది. విజయ నిర్మాణ సంస్థ దీనిని ప్రొడ్యూస్ చేయగా, సింగీతం శ్రీనివాసరావు ఈ పిక్చర్ కు డైరెక్టర్. అప్పటికే సింగీతం శ్రీనివాసరావు -బాలయ్య కాంబోలో వచ్చిన ‘ఆదిత్య 369’ సూపర్ హిట్ కాగా, మళ్లీ వారి కాంబో రిపీట్ అయింది.
ఈ ఫిల్మ్ కోసం 1993 జూన్ 5వ తేదీన మద్రాస్ ‘వాహిని స్టూడియో’లో సెట్ వేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లు హాజరయ్యారు. రోజా, బాలకృష్ణ మీద సీన్ షూట్ చేశారు. దానికి రజనీకాంత్ క్లాప్ కొట్టగా, చిరంజీవి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎన్టీరామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.