షాక్ : మా అద్యక్షుడు విష్ణుకే థియేటర్స్ లేవా..!!

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం   జిన్నా. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి కథ తీసుకొని, కొత్త డైరెక్టర్ ఈశాన్ సూర్య డైరెక్షన్ చేశారు.ఈ సినిమాలో  అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు నటిస్తున్నారు. 

ఈ సినిమా కోసం  ప్రామోషన్స్ కూడా గట్టిగానే చేశారు. మోహన్ బాబు తన కొడుకు విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసాడని తన బిడ్డను ఆశ్వీరదించమని కోరారు. అలాగే విష్ణు కూడా తన సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నాడు. ఇక మా అసోసియేషన్ అధ్యక్షుడుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మీడియాలో విష్ణు పేరు బాగా నానింది. దీనితో జిన్నా మూవీపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యంది.కాని ఈ సినిమా కు థియేటర్స్ దొరకడం లేదని అంటున్నారు.

నిజానికి దీపావళి పండుగ సందర్భంగా విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ కీలక పాత్రలో తెరకెక్కిన ఓరి దేవుడా మరియు తమిళ డబ్బింగ్ సినిమాలు సర్దార్ అండ్ ప్రిన్స్ కూడా విడుదల కానున్నాయి. ఇవన్నీ కూడా మంచి అంచనాలు కలిగి ఉన్నాయి. వీటికే థియేటర్స్ కోసం కొట్టుకొంటున్నారు. అయితే ఇప్పటికే థియేటర్స్ లోసూపర్ గా ఆడుతున్న  కన్నడ డబ్బింగ్ సినిమా కాంతర కూడా వుంది. అల్లు అరవింద్ మంచిగా ఆడుతున్న సినిమాను తీసే పరిస్థితి లేదు. అలాగే గాడ్ ఫాదర్ కొన్ని థియేటర్స్ లో ఆయినా ఉంచాలనే ఒత్తిడి వుంటుంది. వీటి అన్నింటి మధ్య జిన్న కు సరైన థియేటర్స్ లభించడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి మా అసోసియేషన్ అధ్యక్షుడు గా విష్ణు వున్నా కూడా థియేటర్స్ లభించడం లేదని, ఇది తెలుగు సినిమా పరిశ్రమలో వున్న రాజకీయాలకు నిదర్శనం అని కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version