కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుంది :మంత్రి అతిషి

-

మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే బీజేపీదే బాధ్యత అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి అన్నారు.ఆదివారం న్యూఢిల్లీలో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… అరవింద్ కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని అన్నారు. జైల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సరైన రీతిలో వైద్య సహాయం అందించకుండా చంపాలని బీజేపీ పథక రచన చేసిందని ఆరోపించారు.

ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నన్ని సంక్షేమ పనులు బీజేపీ చేయడం లేదని అన్నారు. అందుకే ఈ తరహా కేసులు పెట్టి కేజ్రీవాల్‌ను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బ తీయడమే లక్ష్యంగా బీజేపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు.ఈ నియంత తన ప్రత్యర్థులను.. వారి ఆరోగ్యాన్ని మరింత దిగజార్చడానికి, వారిని చంపడానికి కటకటాల వెనుక ఉంచుతాడంటూ ప్రధానిపై ఆమె పరోక్షంగా విమర్శలు చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భయంకరమైన అపాయకర పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version