ఆరోగ్యంగా ఉండాలంటే మంచి జీవన విధానాన్ని పాటించాలి. అదే విధంగా తీసుకునే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.అజీర్తి సమస్యలు, గ్యాస్, కాన్స్టిపేషన్ ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆహారం తీసుకునేటప్పుడు ఈ తప్పులు లేకుండా చూసుకోండి. దీనితో కడుపు నొప్పి మొదలైన సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కడగని పండ్లు, కూరగాయలు:
కూరగాయలు, పండ్లు పండించే టప్పుడు కెమికల్స్ వంటివాటిని ఉపయోగిస్తారు. అందుకని కూరగాయలు, పండ్లు తినేటప్పుడు ముందు శుభ్రంగా కడుక్కోండి. వాటిని కడుక్కోకుండా తినడం వల్ల హాని కలుగుతుంది.
తక్కువ ఉడికించిన మాంసం:
తక్కువ ఉడికించిన మాంసం తినడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వీటిలో క్రిములు బ్యాక్టీరియా వంటివి ఉంటాయి. దీనితో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
పచ్చి పాలు తాగడం:
పచ్చి పాలు తాగడం వల్ల కూడా అజీర్తి సమస్యలు వస్తాయని గమనించాలి. కనుక పచ్చి పాలు డైట్లో తీసుకోవద్దు.
టీ మరియు కాఫీ:
కడుపు నొప్పి మొదలైన సమస్యలు ఉంటే టీ, కాఫీని తగ్గించడం మంచిది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి.
ఉప్పు మరియు పంచదార:
వీలైనంతవరకూ పంచదార, ఉప్పు డైట్లో తగ్గించడం మంచిది. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే విధంగా కారాన్ని కూడా తగ్గించడం మంచిది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు లేదు అంటే కడుపు నొప్పి మొదలైన సమస్యలు వస్తాయి.