మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ పొందిన హీరోయిన్స్ వీళ్ళే..!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే హిట్ కొట్టి ఆ తర్వాత ఉన్నత స్థానానికి చేరుకున్న హీరోయిన్లు కొంతమంది ఉంటే మరికొంతమంది మొదటి సినిమాతో హిట్టు కొట్టి.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన వాళ్లు కూడా ఉన్నారు. నిజానికి ఇండస్ట్రీలో గుర్తింపు పొందాలి అంటే అదృష్టం ఉండాలి. అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటేనే ఆ తర్వాత కూడా కలిసి వస్తుందని చెబుతూ ఉంటారు. అందుకే తొలి సినిమాతో విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత సక్సెస్ తో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

సమంత:
అక్కినేని వారి మాజీ కోడలు సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. హిట్ అందుకోవడమే కాకుండా తనతో కలిసి నటించిన అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది.

సాయి పల్లవి:
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి. తన నటనతో కుర్ర కారును ఫిదా చేసిన ఈమె అచ్చు తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. తెలంగాణ యాసతో తెలంగాణ వాళ్లకు మరింత దగ్గరైన ఈమె ఇప్పుడు లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

రాశిఖన్నా:
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్:
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించిన ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని.. ఇప్పుడు బాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

వీరితోపాటు మరింత మంది హీరోయిన్లు మొదటి సినిమాతో మంచి విజయం సాధించి.. ఇప్పటికీ స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version