ఇండియాలో టాప్‌ 10 మహిళా పారిశ్రామికవేత్తలు వీరే..

-

ఒక పక్క మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ.. దూసుకెళ్తున్నారు.. మరో పక్క వ్యాపారవేత్తలుగా కూడా మారిపోతున్నారు. ఆడ మగ సమానమే.. ఆడవారిని తక్కువ చేసి చూడ్డానికి అసలు ఎక్కడా అవకాశం లేదు అని మాత్రం పురుషులు భావించడం లేదు. వాళ్లు గౌరవిస్తున్నారు, విలువ ఇస్తున్నారు.. ఎవరికి అంటే.. ఏ స్త్రీ అయితే సొంతంగా డబ్బు సంపాదిస్తుందో.. వారిని గౌరవిస్తున్నారు.. కుటుంబం కోసం ఉద్యోగం చేసే అర్హత ఉన్నా కూడా.. ఇంట్లోనే ఉంటూ జీతం రానీ ఆ ఇంటి చాకిరి చేసే మహిళలను మాత్రం సమాజం కాదు కదా.. ఇంట్లో వాళ్లే గుర్తించడం లేదు.. ఇలాంటి వారికి కొందరు సక్సస్‌ఫుల్‌ అయిన స్త్రీల కథలే ఆదర్శం కావాలి. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. టాప్‌ 10 భారతీయ మహిళా పారిశ్రామికవేత్తల వీరే.

రోష్ని నాదర్ మల్హోత్రా

రోషిణి నాడార్, MBA, HCL టెక్‌కి అధిపతి. HCL అనేది భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన IT కన్సల్టింగ్ మరియు సేవల సంస్థ. ఆమె HCL వ్యవస్థాపకుడు శివనాడార్ కుమార్తె.

ఇందిరా నూయీ

ఇందిరా నూయి రెండు మాస్టర్స్ డిగ్రీలు కలిగి ఉన్నారు. ఈమె 1994లో పెప్సికోలో చేరింది. 2006లో CEOగా నియమితులయ్యారు.. ఫోర్బ్స్ ప్రకారం, ఫార్చ్యూన్ 500 కంపెనీకి 11 మంది మహిళలు మాత్రమే CEO పదవిని కలిగి ఉన్నారు. నూయి శీతల పానీయాలు మరియు స్నాక్ ఫుడ్ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళ.

ఫల్గుణి నాయర్

నైగా అనే సౌందర్య సాధనాల వెబ్‌సైట్‌ను ఫల్గుణి నాయర్ విజయవంతంగా ప్రారంభించి నడుపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఫల్గుణి నాయర్ విలువ దాదాపు 39 వేల కోట్ల రూపాయలు.

కిరణ్ మజుందార్ షా

బెంగుళూరుకు చెందిన కిరణ్ మజుందార్ షా బయోకాన్ వ్యవస్థాపకురాలు. బయోటెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు అందుకున్నారు. ఆమె ఆస్తి విలువ దాదాపు 29 వేల కోట్ల రూపాయలు.

వందనా లూత్రా

వందనా లూత్రా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు. 1989లో, ఆమె VLCC హెల్త్ కేర్, సౌందర్య ఉత్పత్తులు మరియు ఆరోగ్య సేవల సంస్థను ప్రారంభించింది. 2014లో, ఆమె బ్యూటీ అండ్ వెల్‌నెస్ ఇండస్ట్రీ స్కిల్స్ ఫోరమ్‌కి మొదటి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈమె ఆస్తి నికర విలువ దాదాపు 1300 కోట్ల రూపాయలు.

నమితా థాపర్

MQur Pharma ను ముంబైకి చెందిన నమితా థాపర్ స్థాపించారు. గత సంవత్సరం, ఫోర్బ్స్ ప్రచురించిన ఆసియాలోని 20 అత్యంత శక్తివంతమైన వ్యాపారవేత్తల జాబితాలో ఆమె చేర్చబడింది. ఈమె ఆస్తి విలువ దాదాపు 700 కోట్ల రూపాయలు.

వినీతా సింగ్

వినీతా సింగ్ 2012లో షుగర్ కాస్మోటిక్స్‌ను ప్రారంభించారు. ఢిల్లీకి చెందిన వినీతా చెన్నై ఐఐటీలో చదివారు. బ్యూటీ కంపెనీ బెస్ట్ స్టార్టప్ అవార్డు 2019 గెలుచుకుంది. వినీతా ఆస్తి నికర విలువ దాదాపు 300 కోట్ల రూపాయలు.

షానస్ హుస్సేన్

షానస్ కంపెనీ 1978లో ప్రారంభమైంది. దీని వ్యవస్థాపకుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షానస్ హుస్సేన్. హెర్బల్ పదార్థాలతో తయారు చేసిన కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంది. 2006 పద్మశ్రీ అవార్డు గ్రహీత షానస్ నికర విలువ దాదాపు 250 కోట్ల రూపాయలు.

గజల్ అలక్

గజల్ అలక్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు. మామా ఎర్త్ కంపెనీ సౌందర్య ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తుంది. 2021లో, కంపెనీ అత్యుత్తమ స్టార్టప్ కంపెనీగా ఎంపికైంది. హర్యానాకు చెందిన ఖాజల్ అలక్ విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు.

హేమలత అన్నామలై

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన హేమలత అన్నామలై 2008లో ఆంపియర్‌ను స్థాపించారు. ఆంపియర్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే కంపెనీ.

రాధికా అగర్వాల్

హర్యానాకు చెందిన రాధికా అగర్వాల్ షాప్‌క్లోజ్ సహ వ్యవస్థాపకురాలు. ఆమెకు 2016 సంవత్సరపు ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్త అవార్డు లభించింది. తన ఆస్తి నికర విలువ 50 కోట్ల రూపాయలు.

అదితి గుప్తా

రచయిత్రి అదితి గుప్తా జార్ఖండ్‌కు చెందినవారు. తను రచించిన మెన్‌స్ట్రుపీడియా కామిక్ అనే పుస్తకంలో రుతుక్రమంలో మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి చెప్పారు. 2014లో ఫోర్బ్స్ ప్రచురించిన 30 ఏళ్లలోపు 30 మంది భారతీయుల జాబితాలో తన పేరు ఉంది. ఆస్తి విలువ దాదాపు 40 లక్షల రూపాయలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version