సొరకాయ సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఇలా చెయ్యాలి..

-

ఈ మధ్యకాలంలో సొరకాయలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే..దీంతో ఎక్కువ మంది రైతులు ఈ కాయలను పండిస్తున్నారు.సొరకాయ నేలపై, పందిరి సహాయంతో సాగు చేపట్టవచ్చు. రైతులు తక్కువ వ్యయంతో సరైన మెలుకువలు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. నీటి పారుదల ఉండి సేంద్రియ కర్బన పదార్థం అధికంగా ఉండే ఇసుక లోమీ నేలలు,ఎర్ర నేలలు,బంకమట్టి నేలల్లో దిగుబడి అధికంగా ఉంటుంది. నీరు నిల్వని నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి..

అయితే, మంచి దిగుబడిని , చీడపీడలను తట్టుకునే విత్తనరకాలను ఎంపిక చేసుకోవాలి. పూసా సమ్మర్ ప్రోలిఫిక్ రౌండ్, కో 1, పూసా మంజరి , పూస మేఘదూత్ వంటి రకాలు సాగు చేయటం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. ఒక ఎకరానికి 1.5 కిలోల విత్తనాలు సరిపోతాయి.

తెగుళ్ల నివారణకు విత్తడానికి ముందు ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 10 గ్రాములు లేదా కార్బెండజిమ్ 2 గ్రాములు ఒక కిలో విత్తనాలతో కలిపి శుద్ధి చేసుకోవాలి.కలుపు మొక్కలను నివారణకై బ్యుటాక్లొర్ లేదా అల్లాక్లొర్ ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి , మొక్కల మధ్య మల్చింగ్ వేసి కలుపు రాకుండా నియంత్రించవచ్చు

సొరకాయకి పూత ,పిందె కాసే సమయంలో నీటి పారుదల సమృద్ధిగా ఉండేట్లు చూసుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే ఎకరా సోరకాయ సాగుకి సుమారుగా 40 కిలోల నత్రజని ,30కిలోల భాస్వరం మరియు 25కిలోల పోటాష్ ఎరువులు అవసరమవుతాయి. నత్రజని ఎరువును మొత్తం ఒకే సారి వేయకుండా రెండు భాగాలుగా విభజించి వేసుకోవాలి. మొదటి మోతాదుని విత్తిన 4 వారాలకు వేసుకోవాలి. రెండో మోతాదుని పిందె దశలో ఉన్నప్పుడు వేసుకుంటే కాయలు ఎక్కువగా కాస్తాయి..మంచి దిగుబడిని పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version