ఆపిల్స్ ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. ఆహారం అంటే మనకు గుర్తొచ్చేది కూరగాయలు, పండ్లు. ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని దీని వల్ల శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు అందుతాయని అందరికీ తెలుసు. అయితే యాపిల్స్ ని కూడా ఎక్కువగా చాలా మంది తింటూ ఉంటారు.

 

రోజుకి ఒకటి తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని కూడా చెబుతూ ఉంటారు. యాపిల్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం మరియు ఇతర పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే అతిగా ఆపిల్స్ తినడం వల్ల నష్టాలు ఉన్నాయని మీకు తెలుసా..? అవునండి ఆపిల్స్ ని ఎక్కువగా తింటే ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మరి ఆపిల్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

బాగా బరువు పెరుగుతారు:

ఎక్కువ ఆపిల్స్ తినడం వల్ల బరువు బాగా పెరిగి పోతారు. కార్బన్ ఆపిల్స్ లో ఎక్కువగా ఉంటాయి. దీనితో కొవ్వు కరిగించడానికి కుదరదు. ఇలా బరువు బాగా పెరిగి పోతారు.

జీర్ణ సమస్యలు:

ఎక్కువ ఆపిల్స్ తినడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతిగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు లాంటివి కలగొచ్చు.

బ్లడ్ షుగర్ లెవెల్స్:

ఆపిల్స్ లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి ఎక్కువ ఆపిల్స్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

పంటి సమస్యలు:

బాగా ఎక్కువ ఆపిల్ తీసుకోవడం వల్ల పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆపిల్ అనేది ఎసిడిక్. దీని కారణంగా పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అయితే రోజుకు ఎన్ని ఆపిల్స్ తీసుకోవాలి..?

అతిగా ఆపిల్స్ తీసుకోవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయి కదా.. కనుక ఎన్ని ఆపిల్ తీసుకుంటే మంచిది అనేది తెలుసుకోవడం ముఖ్యం. అయితే సాధారణంగా ఒక రోజు ఒక ఆపిల్ తీసుకుంటే మంచిది లేదు అంటే మీరు రోజుకి రెండు మీడియం సైజు ఆపిల్స్ తింటే మంచిది. కాని దీని కంటే ఎక్కువ తినడం వల్ల తప్పక ఈ సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version