మత్తు మందు ఇచ్చి ఆవులను దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ లో ఆవులకు మత్తు పదార్థాలు ఇచ్చి చోరీ చేస్తున్నా వ్యక్తులను గుర్తించిన స్థానికులు, సీసీ కెమెరాలో నమోదు కావడంతో సోషల్ మీడియాలో జిహాద్ పేరిట చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయంపై బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డిని వివరణ కోరగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మత్తు పదార్థాలు ఇచ్చి ఆవులను చోరీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని. దీనిపై విచారణ చేసి బాధితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. మత్తు మందు ఇచ్చి ఆవులను దొంగలు ఎత్తుకెళ్లడంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.