ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన రికార్డ్…. ప్రపంచంలో థర్డ్ బిజియెస్ట్ ఎయిర్ పోర్ట్

-

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమం అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే మూడో విమానాశ్రయంగా ఘనతకెక్కింది. యూకే దేశానికి చెందిన ఆఫీషియల్ ఎయిర్ లైన్ గైడ్ (OAG) నివేదిక ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదకి అత్యంత రద్దీగా ఉండే విమానమార్గాలు, ఎయిర్ పోర్టులు, ప్లైట్స్ డేటాకు సంబంధించిన అనేక అంశాలను విశ్లేషిస్తుంది.

తాజా ఈ నివేదిక ప్రకారం అంతకుముందు మూడో స్థానంలో ఉన్న చైనాలోని గ్వాంగ్ జౌ విమానాశ్రయాన్ని వెనక్కి నెట్టి ఆరు స్థానాలకు ఎగబాకి ఢిల్లీ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్టుల్లో యూఎస్ లోని అట్లాంటా ఎయిర్ పోర్ట్ మొదటిస్థానంలో నిలవగా… దుబాయ్ ఎయిర్ పోర్ట్ రెండో స్థానంలో ఉంది. 

టాప్ 10 జాబితాలోని ఇతర విమానాశ్రయాలలో యూఎస్ లోని డల్లాస్ డల్లాస్/ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం, చికాగో ఓ’హేర్ అంతర్జాతీయ విమానాశ్రయం, డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం, లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయాలు, జపాన్ లోని టోక్యో ఇంటర్నేషనల్ (హనేడా), యూకేలోని లండన్ హీత్రూ విమానాశ్రయం ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version