ముందున్న కాలంలో కేజీఎఫ్ సిరీస్ ను కొనసాగించాలన్న ఉత్సాహానికి మరో కొత్త ఆసరా దక్కింది. అందుకు తగ్గ ఆలోచనకు కార్య రూపం ఇవ్వాలనేందుకు ఇంకొంత కాలం సమయం పట్టినా కూడా రేపటి వేళ మరో ప్రభంజనం నమోదు కావడం ఖాయం.ఇప్పటి కన్నా బాగా ఆలోచించి తీయగలిగితే బాక్సాఫీసు దగ్గర నెలకొన్న కలెక్షన్ల సునామీ మరో సారి కొనసాగడం ఖాయం.
అవును ! చాప్టర్ 2 కన్నా చాప్టర్ 1 బాగుంది. ఇంకా శ్రద్ధ వహించి తీసేందుకు ఆస్కారం ఉన్న కథ ఇది. ఈ సిరీస్ ను కొనసాగించే ప్రక్రియలో ఇప్పటి మాదిరిగానే కొన్ని రాజకీయ పరిణామాలనూ కలిపే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఈ శుక్రవారం కేజీఎఫ్ చేస్తున్న హంగామాను తల్చుకుంటూనే., రేపటి వేళ ఏం రాయవచ్చునో కూడా చర్చిద్దాం.ఆ వివరం ఈ కథనంలో…ప్రతి శుక్రవారం సినిమా వాళ్ల జాతకాలు మారుతాయి. ప్రతి శుక్రవారం ఊహాతీత ఫలితాలు వెలుగులోకి వస్తాయి. అవే కొన్ని రోజుల పాటు దీపావళి కాంతులను తలపిస్తూ ఆనందాలను పంచుతాయి. పండగ సంతోషాలను మోసుకువస్తాయి. కొన్నేళ్ల కష్టం మైమరిచిపోయేందుకు ఓ చిన్న అవకాశం కూడా ఇస్తాయి. ఆ విధంగా ఎన్నో అవస్థలు దాటి యశ్ అనే కన్నడ నటుడు ఇవాళ
భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించే స్థాయికి చేరుకున్నారు. అప్పటిదాకా ఎవ్వరూ పట్టించుకోని కన్నడ చిత్ర పరిశ్రమ పేరు ఈ రోజు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది అంటే అందుకు కారణం అతడే ! దక్షిణాది చిత్రాలకు ముఖ్యంగా కన్నడ భాషకు చెందిన చిత్రాలకు మార్కెట్ వాల్యూ చాలా తక్కువ అన్న అభిప్రాయాన్ని పూర్తిగా చెరిపిన కేజీఎఫ్. ఆ సినిమా కథ మరియు కథన రీతులు చూసి ఎందరో దిగ్గజ దర్శకులు ఫిదా అయిపోయారు. ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభిమానులుగా మారిపోయారు. అతిశయం కాదు వాస్తవం.
బాక్సాఫీస్ కా బాద్షా ఎవరు అన్న విషయమై ఓ క్లారిటీ వచ్చింది. యశ్ నటించిన కేజీఎఫ్ – చాప్టర్ 2, ట్రిపుల్ ఆర్ ను మించిన విజయం సాధిస్తుంది అని చెప్పేందుకు డౌట్ లేదు. ఇప్పటికే బాలీవుడ్ సైతం అవాక్కవుతోంది. గడిచిన వారం రోజులుగా ఈ సినిమాను దాటి మరో సినిమా కలెక్షన్లు లేవు. ఆ విధంగా కేజీఎఫ్ సిరీస్ కు ఎక్కడా అడ్డూ అదుపూ అన్నది లేకుండా ఉంది. ఒక్క హిందీలోనే కాదు తమిళంలోనూ కూడా ఈ శుక్రవారం పెద్దగా చెప్పుకోదగ్గ చిత్రాలేవీ విడుదలకు నోచుకోవడం లేదు.
ఏదేమయినా యశ్ హవాను ఆపడం ఎవ్వరి తరం కాదని తేలిపోయింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కు బాలీవుడ్ సైతం నోరెళ్ల పెడుతోంది. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఆయన చేరుకున్న వైనంపై ఇప్పటికే అంతా ఆత్మీయ పూర్వక ప్రశంసలే ఇస్తున్నారు. ఆ కోవలో ఆ తోవలో యశ్ కు ఇప్పుడు అన్ని భాషలకూ చెందిన సినీ పరిశ్రమ వర్గాల నుంచి మంచి మద్దతు దొరుకుతుంది. అంతేకాదు పలు మల్టీ స్టారర్ సినిమాలకు కూడా యశ్ ను ఎంచుకునే అవకాశాలున్నాయి. అందుకు రేపటి వేళ ఆయనే బెస్ట్ ఛాయిస్ కానున్నారు కూడా !

ఇక కథ పరంగా మరింతగా స్పష్టత ఇస్తూ తీస్తే ఇంకొన్ని ఫలితాలు సానుకూలంగా ఉండేవి. ఆ మాటకు వస్తే చాప్టర్ ఒన్ తో పోలిస్తే గొప్ప కథ, కథనం కాదు. చాప్టర్ 2 వరకూ ఆ లోటు ఉంది. అయినా కూడా డైరెక్టర్ కొన్ని తెలివితేటలు జోడించి సినిమాను హ్యాండిల్ చేసి స్క్కీన్ టైం పై విసుగు రాకుండా చేశారు. ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యారు. ముందున్న రోజుల్లో ఇంకొన్ని
రాజకీయ పరిణామాలనూ జోడించి చాప్టర్ 3 రావడం ఖాయం కనుక ఇప్పటి తప్పిదాలు తప్పక ఆయన దిద్దుకోవాలి.
రాజకీయ పరిణామాలనూ జోడించి చాప్టర్ 3 రావడం ఖాయం కనుక ఇప్పటి తప్పిదాలు తప్పక ఆయన దిద్దుకోవాలి.