ప్రస్తుతం స్థూలకాయం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అది చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపే వ్యాధులలో ఊబకాయం ఒకటి. ఊబకాయం అంటే అధిక బరువే కాదు ఉబకాయం వల్ల డయాబెటిస్, గుండె కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీని వల్ల దీర్ఘకాలికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఉబకాయం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా సరైన జీవన శైలి లేకపోవడం. మన జీవన శైలిలో మంచి మార్పులు చేసుకొనవలెను. ఒకవేళ ఒబెసిటీ సమస్యతో బాధపడుతూ ఉంటే మంచి జీవనశైలి తో పాటు యాంటీ ఒబెసిటీ మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం ఈ వ్యాధి వారి జీన్స్ నుండి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన జీన్స్ కొవ్వు నిల్వలను నియంత్రిస్తాయి. అయితే ఈరోజు మనం ఊబకాయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
సాధారణంగా ఒక మనిషి వారి ఐడియల్ బాడీని మించి 25 శాతం ఎక్కువ బరువు ఉంటే వారిని స్థూలకాయులుగా భావిస్తారు. సాధారణంగా ఈ స్థూల కాయం మన జీవనశైలి,ఆహార శైలిలో గల మార్పుల వలన ఈ స్థూల కాయం సంభవిస్తుంది. మనం ప్రతిరోజు సమయానికి నిద్ర లేవడం, వ్యాయామాలు చేయడం,సరైన మంచి ఆహారం తీసుకోవడం వలన కొంతవరకు మన స్థూలకాయాన్ని తగ్గించుకొనవచ్చు.
మనం ప్రతి రోజూ మన ఆహారంలో ఆకుకూరలు, పాలు కూరగాయలు, పప్పు దినుసులు, సిరి ధాన్యాలు, పండ్లు ఇలా విటమిన్లు, ప్రోటీన్స్, పీచు పదార్థాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వలన మనం మన స్థూలకాయాన్ని కొంత వరకు తగ్గించుకోవచ్చు. కానీ కొంతమందిలో జీన్స్ ఉంటాయి.వారు ఎంత మంచి ఆహారం తీసుకున్నా.. వ్యాయామాలు చేసినా..వారు బరువు తగ్గరు. అలాంటివారు డాక్టర్లను సంప్రదించి మందులతో పాటు మంచి డైట్ ని ఫాలో అయితే వారికి తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి.