బ్రస్ట్‌ క్యాన్సర్‌ ఉందో లేదో ఇంట్లోనే ఇలా చెక్‌ చేసుకోవచ్చు ..!

-

బ్రస్ట్ క్యాన్సర్ స్త్రీల మరణాలకి దారితీస్తుంది కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.. ఊబకాయం, అతిగా మద్యం సేవించడం, ఈస్ట్రోజెన్ ఎక్కువగా తీసుకోవడం వంటి కారణాల వల్ల పురుషులకు బ్రెస్ట్ క్యాన్సర్ రావడం సర్వసాధారణం అయిపోయింది..మీకు తెలుసా ఇంట్లో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే, లేదా ప్రస్తుతం క్యాన్సర్ అభివృద్ధి చెందుతున్నట్లయితే, వారి కుటుంబ సభ్యులకు(మహిళలు) రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో 40 దాటకే ఈ క్యాన్సర్ కనిపిస్తుందట. అయితే ఈరోజు ఎవరిలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, ఇంట్లోనే ఎలా చెక్ చేసుకోవచ్చో చూద్దాం.

ఎవరికి ఎక్కువగా వస్తుందంటే..

గర్భం మరియు మెన్స్ట్రుల్ చరిత్ర: 12 సంవత్సరాల కంటే ముందు రజస్వల అయిన లేదా 55 సంవత్సరాల తరువాత మెనోపాస్ వచ్చిన మహిళలు, లేదా పిల్లలు లేని మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

శరీర బరువు: ఊబకాయం లేదా అధిక బరువు ఉన్న వ్యక్తులు సాధారణ బరువు ఉన్న వారి కంటే రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఆహారం: అధిక కొవ్వు కలిగిన ఆహారం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొవ్వు కణితి పెరుగుదలకు ఇంధనంగా ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ ను ప్రేరేపించటంతో ఈ ప్రమాదం వచ్చే అవకాశం లేకపోలేదు.

పొగాకు/మద్యం సేవించడం: ఇవి ఒక్క క్యాన్సర్ కే కాదు..అన్నీ రోగాలకు మాలం ఈ చెడు అలవాట్లే.. పొగాకు లేదా మద్యం సేవించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పరీక్ష చేసే విధానం:

రొమ్ములు ద్వైపాక్షిక సౌష్టవంగా ఉన్నాయా లేదా చూడండి. రొమ్ము చర్మం రంగు మారుతున్నాయా, చనుమొనలు మునిగిపోయాయా మొదలైనవి గమనించడానికి పెద్ద అద్దం ముందు దీన్ని చేయడం ఉత్తమం.

తాకడం: ఒక చేతిని పైకి లేపి, బొటనవేలు తప్ప మిగిలిన నాలుగు వేళ్లను ఒకదానితో ఒకటి తీసుకుని, గడ్డలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి గుండ్రంగా చేతిని తిప్పండి.

ప్రస్ చేయటం: రొమ్ము వెలుపలి భాగాన్ని చంక వరకు ప్రస్ చేస్తూ ఉండండి..దీని ద్వారా గడ్డలు ఉన్నాయా లేదా తెలుస్తుంది.

స్క్వీజ్: ఏదైనా ద్రవం కారుతుందో చూడండి..ఎర్రటి ద్రవం చిందినట్లయితే, మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి.

బ్రస్ట్ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు ఏంటి?

రొమ్ములో నొప్పి గడ్డలు రావడం
బ్రస్ట్ పై చర్మం మసకబారడం
చనుమొనలపై దద్దుర్లు లేదా పుండు
చనుమొనల గుండా రక్తపు మరకలున్న డిశ్చార్జ్
చంకలో గడ్డలు రావడం

ఒకవేళ పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా కనిపించినట్లయితే, అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. ముందస్తుగా గుర్తించడం వల్ల క్యాన్సర్ పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇక్కడ సమస్యే ఏంటంటే..మహిళలు ఈ క్యాన్సర్ ని త్వరగా గుర్తించలేకపోతున్నారు. దాని ద్వారా పరిస్థితి చేయిజారిపోతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version