యాంకర్ రష్మీ గౌతమ్.. జబర్దస్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ షో ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న రష్మీ తన అందచందాలతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు సినిమాలలో ఈమె చేసే రొమాన్స్ చూసి కుర్ర కారు గుండెల్లో హీట్ పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా హీరోలతో ఈమె చేసే రొమాన్స్ ఎంతలా ఉంటుందంటే ఒక్కోసారి హాలీవుడ్ చిత్రాలను తలపించే రేంజ్ లో రొమాన్స్ చేస్తూ ఉంటుంది రష్మీ. అంతేకాదు ఈమె గొప్ప సంఘసంస్కర్త కూడా.. ఎక్కడైనా వీధిలో మూగజీవాలకు హాని కలిగిందని తెలిస్తే మాత్రం తన ఇంస్టాగ్రామ్ , ట్విట్టర్ ద్వారా తన బాధను తెలియజేస్తూ ఉంటుంది. మూగజీవులను ఎవరైనా హింసించారని తెలిస్తే వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కూడా వెనుకాడదు రష్మీ.
ఇక ఇటీవల రాంప్రసాద్, ఆది , గెటప్ శ్రీను లాంటివారు కలగజేసుకొని రష్మీ , సుధీర్ కేవలం స్కిట్ కోసం మాత్రమే చేస్తారు అని, వారిద్దరి మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని తెలియజేశారు. ఇక ఇదే విషయాన్ని ఆమె స్పష్టం చేస్తూ ఇటీవల విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో రష్మీ గౌతమ్ త్వరలో నిజంగానే పెళ్లి చేసుకోబోతోంది అని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇకపోతే ఈ ప్రోగ్రాం లో అక్క బావ ఎక్కడ అనే ఎపిసోడ్ తో విడుదల చేయడం జరిగింది . ఇందులో తన పెళ్లి గురించి ప్రకటన చేయడంతో ఈ ప్రోమో కాస్త బాగా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇక రష్మీ మాట్లాడుతూ ఇన్ని రోజులు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్నకు ఈరోజు నేను సమాధానం చెప్పబోతున్నాను నాకు వివాహం కుదిరింది అంటూ సిగ్గు పడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో బాగా వైరల్ గా మారింది.