ఈ వారం సినీ ప్రియులకు పండగే.. ఎన్ని చిత్రాలు వస్తున్నాయో తెలుసా?

-

సినీ అభిమానులకు ఈ వారం పండగే పండగ. దసరాకు ఇంకా 20 రోజులు ఉండగా, థియేటర్‌లలో ఆ సందడి ఈ వారమే కనిపించనుంది. చిన్న హీరోల చిత్రాలు ఈ వారం అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.

శింబు హీరోగా నటించిన తాజా చిత్రం ముత్తు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు. సిద్ధి ఇద్నానీ, రాధిక, సిద్ధిఖ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంగీతం ఏఆర్‌ రెహమాన్‌ అందించారు. గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌ జంటగా నటించిన చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. శ్రీధర్‌గాదె దర్శకుడు. సంగీతం మణిశర్మ సమకూర్చారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌బాబు, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సంగీతం వివేక్‌ సాగర్‌ అందించారు. ఇది కూడా శుక్రవారం ప్రేక్షకులను అలరించనుంది.

సుదీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేదా థామస్‌ కీలకపాత్రల్లో నటించిన శాకినీ డాకినీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకుర రానుంది. మిక్కీ జే మేయర్‌ సంగీత దర్శకుడు.

సుదీప్‌, మడోనా సెబాస్టియన్‌, అఫ్తాబ్‌, రవిశంకర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు నటించిన కోటికొక్కడు ఈ శుక్రవారం విడుదల కానుంది. వీజే సన్నీ హీరోగా సకల.. గుణాభిరామ ఈ శుక్రవారం అలరించనుంది.దర్శకత్వం వెలిగొండ శ్రీనివాస్ చేశారు. నేను కేరాఫ్‌ నువ్వు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

అమెజాన్‌ ప్రైమ్‌

  • విరుమన్‌ (తమిళ చిత్రం) సెప్టెంబరు 11

డిస్నీ+హాట్‌స్టార్‌

  • విక్రాంత్‌ రోణ (తెలుగు) సెప్టెంబరు 16
  • దహన్‌ (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 16

నెట్‌ఫ్లిక్స్‌

  • జోగి (హిందీ) సెప్టెంబరు 16

సోనీలివ్‌

  • రామారావు ఆన్‌ డ్యూటీ (తెలుగు)
  •  కాలేజ్‌ రొమాన్స్‌ (హిందీ సిరిస్‌-3) సెప్టెంబరు15

ఆహా

  • డ్యాన్స్‌ ఐకాన్‌ (రియాల్టీ షో) సెప్టెంబరు 11

ఎంఎక్స్‌ ప్లేయర్‌

  •  శిక్షా మండల్‌ (హిందీ) సెప్టెంబరు 15

Read more RELATED
Recommended to you

Exit mobile version