టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు మంచి విజయాలను అందుకున్నారు. మరి కొంతమంది భారీ డిజాస్టర్ లను చవి చూశారు. కొంతమంది హీరోలు ఏడాదికి ఒక సినిమా అంటూ విడుదల చేస్తున్నా. ఈ ఏడాది మాత్రం ఏ ఒక్క సినిమాను కూడా విడుదల చేయని స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. ఇంతకీ ఏ హీరోలు ఈ ఏడాది థియేటర్లలో కనిపించలేదో వాటి గురించి తెలుసుకుందాం.
1). బాలయ్య:
గత సంవత్సరం అఖండ సినిమాతో పలు రికార్డులను సైతం సృష్టించిన బాలయ్య ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర పలకరించలేదు. ముఖ్యంగా బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.
2). సాయి ధరమ్ తేజ్:
కెరియర్ మొదట్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లిన మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఒక్క సినిమాని కూడా విడుదల చేయలేదు. గత ఏడాది ఆక్సిడెంట్ కారణంగా కాస్త విశ్రాంతి ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు.
3). అఖిల్:
కెరియర్ మొదటి నుంచి వరుస ప్లాప్లను చవిచూసిన అఖిల్.. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ ఏడాది కూడా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం లేదు.
4). అల్లు అర్జున్: