కేసీఆర్‌కు ఆ ఇద్ద‌రి నుంచి ముప్పు.. అందుకేనా నీళ్ల సెంటిమెంట్‌..?

-

తెలంగాణ రాజ‌కీయాల్లో అప‌ర చాణ‌క్యుడిగా వెలువొందుతున్నారు సీఎం కేసీఆర్‌. ఆయ‌న వ్యూహం పన్నితే ప్ర‌తిప‌క్షాలు ప‌రార్ కావాల్సిందే. ఎంత పెద్ద స‌మ‌స్య‌ను అయినా త‌న దైన స్టైల్‌లో త‌న‌వైపు పాజిటివ్ వేవ్ వ‌చ్చేలా చూసుకుంటారు ఆయ‌న‌. ఇక ఈ క్ర‌మంలో ఇప్పుడు తెలంగాణ‌లో అనూహ్యంగా ఆయ‌న‌కు ఇద్ద‌రి నుంచి పెద్ద దెబ్బ వ‌చ్చే చాన్ష్ ఉంది.

కేసీఆర్‌ /kcr

కేసీఆర్ అంటేనే ఒంటి కాలిపై లేచే రేవంత్‌కు కాంగ్రెస్ ప‌గ్గాలు ఇవ్వ‌డం, ఇంకోవైపు ష‌ర్మిల కొత్త పార్టీ కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోనే కీల‌క నేత అయిన ఈట‌ల రాజేంద‌ర్ పార్టీనిక వీడ‌టంతో కేసీఆర్ కు చాలా నెగెటివ్ టాక్ వ‌స్తోంది. ఇక వీట‌న్నింటి నుంచి బ‌య‌ట‌ప‌డి ఎలాగైనా హుజూరాబాద్‌లో గెలిచేందుకు ప్లాన్ వేశారు కేసీఆర్‌.

మొద‌టి నుంచి త‌న‌ను కాపాడుతున్న ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చారు. వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అయిన గులాబీ బాస్‌.. ఈ ఒక్క షాట్‌తో అటు ష‌ర్మిల నోరు తెర‌వ‌కుండా చేశారు. ఇటు బీజేపీని సైలెంట్ అయ్యేలా ప్లాన్ వేశారు. ఇక రేవంత్ మాత్ర‌మే అంతో ఇంతో మాట్లాడినా పెద్ద‌గా రెస్పాన్స్ రావ‌ట్లేదు. ఈ సెంటిమెంట్ రాబోయే హుజూరాబాద్ ఉపఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ను గెలిపిస్తుంద‌ని కేసీఆర్ న‌మ్ముతున్నారు. చూడాలి మ‌రి ఏ మేర‌కు ప‌నిచేస్తుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version