సమాజం కోసం ముగ్గురు పిల్లలను కనాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

-

సమాజ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ ముగ్గురూ పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నాగ్ పూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జనాభా తగ్గుదల ఆందోళనకరమన్నారు. అది సమాజాన్ని నాశనం చేస్తుందన్నారు. జనాభా సైన్స్ ప్రకారం.. జననాల రేటు 2.1 కంటే తక్కువగా ఉంటే ఈ భూమి మీద సమాజం అంతరించిపోతుందన్నారు. అందుకే ఇద్దరి కంటే ఎక్కువ లేదా ముగ్గురు అవసరం అన్నారు.

Mohan Bhagavath

అదేవిధంగా భాషలు కనుమరగవుతున్నాయని తెలిపారు. భారత జనాభా విధానం కూడా ఈ రేటు 2.1 కన్నా తక్కువ ఉండకూడదని చెబుతోంది. మన దేశానికి సంబంధించి ఇది మూడుగా ఉండాలని.. ఈ సంఖ్య చాలా కీలకం అన్నారు. ఎందుకంటే సమాజ మనుగడకు అది అవసరం అని మోహన్ భగవత్ పేర్కొన్నారు. 1960-2000 మధ్య రెట్టింపు అయిన ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఆ తరువాత నుంచి తగ్గుముఖం పడుతోందని నివేదికలు చెబుతున్నాయని తెలిపారు. ప్రతీ మహిళా 2.1 మందిని కంటేనే పాత తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు జరుగుతాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version