న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. దాదాపు విజయానికి చేరువైంది. మరో మూడు వికెట్లు తీస్తే మ్యాచ్ టీమిండియా సొంతమవుతుంది. కాగా, న్యూజిలాండ్ విజయానికి చేరువ కావాలంటే మరో 142 పరుగులు చేయాల్సి ఉంటుంది. కానీ, కివీస్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విజయం కాదు కదా డ్రా చేసుకోవడం కూడా కష్టమే.
తొలి టెస్టు ఐదో రోజు తొలి రెండు ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు పైచేయి సాధించారు. వికెట్ నష్టానికి మూడు పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన టామ్ లాథమ్, విలియం సోమర్విల్లే నిలకడగా ఆడారు. రెండో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సోమర్విల్లే, 52 పరుగుల వద్ద టామ్ లాథమ్ అవుట్ కావడంతో టీమిండియా బౌలర్లు విజృంభించారు. కివీస్ ప్లేయర్లు క్రీజులో నిలువకుండా త్వరత్వరగా వికెట్లు పడగొట్టారు. దీంతో 143 పరుగులకు ఏడు వికెట్ల నష్టంతో కివీస్ ఓటమికి చేరువైంది.