అక్రమ మైనింగ్.. డీఎస్పీని చంపిన దుండగులు

-

హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లోని అరావలి కొండల్లో ఇటీవల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం పోలీసులు అక్కడికి చేరుకుని అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు డీఎస్పీని ట్రాక్టర్‌తో గుద్ది చంపేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

డీఎస్పీ మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరావలి కొండల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ సురేందర్ సింగ్ మైనింగ్‌ను అడ్డుకునేందుకు బయల్దేరాడు. దీంతో డంపర్ డ్రైవర్ తన వాహనాన్ని డీఎస్పీ దగ్గరికి తీసుకెళ్లాడు. పేపర్లు చెకింగ్ చేయాలని డీఎస్పీ అడ్డుకోవడంతో డ్రైవర్ దురుసుగా ప్రవర్తించి.. వేగంగా వాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో డీఎస్పీకి తీవ్రగాయాలు అయ్యాయి. డీఎస్పీని ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నుహ్ జిల్లాలో అక్రమ మైనింగ్ ఎక్కువగా జరుగుతుంది. ప్రతి ఏడాది 50కి పైగా ఫిర్యాదులు వచ్చినా.. పోలీసులు పట్టించుకోరని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version