కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. కర్ణాటక హైకోర్ట్ తీర్పుతో పరిస్థితిలో కొంతమార్పు వచ్చింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో మరో వివాదం ప్రారంభం కాబోతోందా… అంటే జౌననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టిప్పు సుల్తాన్ వివాదం కర్ణాటకలో కొత్తగా మొదలువబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక పాఠ్యాంశాల్లో టిప్పు సుల్తాన్ గురించి ఉన్న కొన్ని అంశాలను తొలగించేందుకు బొమ్మై సర్కార్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు కూడా మొదలయ్యాయి. బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం రోహిత్ చక్రతీర్థ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించింది. పాఠ్యాంశాల్లో ఉన్న సిలబస్ పై ఈ కమిటీ రివ్యూ చేసింది.
కర్ణాటకలో హిజాబ్ వివాదం రగులుతోంది… తాజాగా టిప్పు సుల్తాన్ వివాదం ప్రారంభం కాబోతోందా…?
-