ఫేక్ రెమ్ డిసివర్.. గుర్తుపట్టడానికి ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కొన్ని సూచనలు..

-

రెమ్ డిసివర్.. కోవిడ్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైతే కావాల్సిన ఇంజక్షన్. కరోనా వల్ల బాగా ఇబ్బంది ఉన్నప్పుడు దాన్నుండి ఉపశమనం పొందడానికి పనికొచ్చే మెడిసిన్. ప్రస్తుతం రెమ్ డిసివర్ కొరత చాలా ఉంది. దీని కారణంగా కొంత మంది దుండగులు రెమ్ డిసివర్ పేరుతో ఫేక్ మెడిసిన్ అమ్ముతున్నారు. ఆ ఫేక్ మెడిసిన్ ని గుర్తు పట్టడానికి ఐపీఎస్ ఆఫీసర్ మోనికా బరద్వాజ్ కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం.

ఒరిజినల్ రెమ్ డిసివర్ ప్యాకేజీపై ఆర్ ఎక్స్ అన్న ఇంగ్లీష్ అక్షరాలు ఉంటాయి. ఫేమ్ మెడిసిన్ మీద ఇది ఉండదు.

ఇంగ్లీష్ కేపిటల్ అక్షరాలు లేకపోవడం. ప్యాకేజీలోని మూడవ లైన్లో “100 mg/Vial” అని ఉండాలి. ఫేక్ మెడిసిన్ మీద “100 mg/vial” అని ఉంటుంది.

బ్రాండ్ పేరు కింద ఉన్న మరో లైన్లో కేపిటల్ అక్షరాలు లేకపోవడం. Vial స్థానంలో vial ఉండడం.

ప్యాకేజీ బాక్స్ వెనకాల వార్నింగ్ అని రాసి ఉన్న అక్షరాలు ఎరుపు కలర్ లో ఉండాలి. కానీ ఫేక్ మెడిసిన్ కి నలుపు రంగులో వార్నింగ్ అని రాసి ఉండడం.

కేపిటల్ అక్షరాల్లో తప్పులు.. ప్యాకేజీ ముందు భాగంలో “For use” అని ఉండాల్సింది “for use” అని ఉండడం.

వార్నింగ్ లేబుల్ కింద బ్రాండ్ నేమ్ కోవిఫిర్, తయారీ కంపెనీ గిలీడ్ సైన్సెస్ ఇన్ కార్పోరేషన్ అని ఉండాలి. ఫేక్ మెడిసిన్ లో ఇన్ కార్పోరేషన్ అని ఉండదు.

కేపిటల్ అక్షరాల తప్పు, తయారీ దారు కంపెనీ అయిన హెటెరో తర్వాత India అన్న పదం indiaగా ఉండడం.

రెమ్ డిసివర్ ఎక్కడ తయారైందన్న అడ్రస్ లో Telangana కి బదులు Telagana అని ఉంటుంది.

పై వివరాలు జాగ్రత్త గమనించిన తర్వాతే రెమ్ డిసివర్ మెడిసిన్ ని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version