ఇటీవల రాష్ట్రంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హల్ చల్ సృష్టించింది. అయితే తనను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ అరోపించారు. అంతే కాకుండా తన అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు.
ఇందు కోసం గురువారం బండి సంజయ్ ఢిల్లీ కి వెళ్లారు. ఈ రోజు మధ్యహ్నం ప్రివిలేజ్ కమిటీ ముందు ఎంపీ బండి సంజయ్ హాజరు అవుతారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేసిన విధానాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ తెలియజేస్తారు. కాగ ఉద్యోగుల బదిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ వో నెంబర్ 317 ను సవరించాలని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేస్తు.. దీక్ష చేశారు. అయితే బండి సంజయ్ దీక్ష సమయంలో కరోనా నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్టు చేశారు.