తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నేడు తమళనాడు పర్యటన కు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానం లో కుటుంబ సమేతం గా తమిళనాడు లోని శ్రీ రంగంలో గల రంగనాథ స్వామి ని ర్శించుకోనున్నారు. అక్కడి నుంచి తిరిగి చెన్నై లో రాత్రి బస చేయనున్నారు. అనంతరం మంగళ వారం ఉదయం తమిళ నాడు ముఖ్య మంత్రి ఎం.కే స్టాలిన్ తో సమావేశం కానున్నారు. అయితే ఇద్దరి ముఖ్య మంత్రులు సమావేశం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. వీరి మధ్య ముఖ్యం గా ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించే చర్చ వస్తుందని పలువురు భావిస్తున్నారు.
ఇంతకు ముందు కూడా స్టాలీన్ డీఎంకే అధ్యక్షుడి గా ఉన్న సమయం లో వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ గురించి వీరు చర్చించారు. అయితే గత ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అంశం ముందుకు సాగలేదు. అయితే ఈ సమయం లో ఇద్దరు ముఖ్య మంత్రులు సమావేశం కావడం తో మరో సారి ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన అంశం చర్చకు వచ్చింది. కాగ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. అయితే వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పై ఒత్తిడి తీసుకురావడానికి పలు పార్టీల మద్దత్తు కూడా తీసుకునేందుకు సీఎం కేసీఆర్ భావిస్తున్నాడు. ఈ సమావేశం లో ఇది కూడా చర్చ కు వచ్చే అవకాశం ఉంది.