రేపు టాలీవుడ్ ప్రముఖుల భేటీ… సమస్యలపై చర్చ

-

టాలీవుడ్ ప్రముఖులు రేపు ఆదివారం భేటీ కాబోతున్నారు. ఇండస్ట్రీలోని సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటు.. ఇతర సమస్యలపై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. ఈ సమావేశం తర్వాత తొలిసారి తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు.

రేపు ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. దీని కోసం ఇప్పటికే 240 మందికి ఆహ్వానాలు అందాయి. సీఎం జగన్ తో భేటీ తర్వాత సినీ ప్రముఖులు భేటీ అవుతుండటంతో.. దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇండస్ట్రీలో సమస్యలతో పాటు కార్మికుల సంక్షేమంపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలోని అంశాలపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన ప్రతిపాదనల గురించి కూడా మాట్లాడనున్నారు. తెలంగాణకు ధీటుగా.. ఏపీలో కూడా టాలీవుడ్ ను డెవలప్ చేయాలని… విశాఖలో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కు క్రుషి చేయాలని.. అని సౌకర్యాలు కల్పిస్తామంటూ… సీఎం జగన్ నుంచి టాలీవుడ్ కు ప్రతిపాదనలు అందాయి. రేపటి సమావేశంలో ఇవి కూాడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version