టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పే డైలాగులతో బాగా ఫేమస్ అయిన నటుడు మరియు కమెడియన్ పృథ్వి రాజ్ గురించి తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం పృథ్వి రాజ్ తీవ్ర అస్వస్థకు లోనయినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉండగా అనారోగ్యం పాలైన పృథ్వి రాజ్ ను ఫ్యామిలీ మెంబెర్స్ వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. కాగా ఇప్పుడు ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను తీసుకుంటున్నారు. అయితే కొంతసమయం చికిత్సను తీసుకున్న అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స్వయంగా పృథ్విరాజ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.