మేడారం జాత‌ర‌లో విషాదం.. తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తులు మృతి

-

ములుగు జిల్లాలో మేడారం జాత‌ర ఈ నెల 16 వ తేదీ నుంచి ప్రారంభం అయింది. బుధ‌వారం రాత్రి సార‌క్క గ‌ద్దెకు చేర‌గా.. గురు వారం రాత్రి సమ్మ‌క్క‌ను ప్ర‌భుత్వ లంఛ‌నాల‌తో గ‌ద్దెపై కి తీసుకువ‌చ్చారు. కాగ స‌మ్మ‌క్కను ఊరేగింపు తీసుకువ‌చ్చే స‌మ‌యంలో వేల సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. దీంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈ తొక్కిస‌లాట‌లో ఇద్ద‌రు భ‌క్తులు మృతి చెందారు. కాగ స‌మ్మ‌క్క ఊరేగింపు ను చూడటానికి వ‌చ్చిన ఇద్ద‌రు భ‌క్తులు తొక్కిస‌లాట‌లో చిక్కుకున్నారు.

పోలీసులు గుర్తించి.. ప్ర‌థ‌మ చికిత్స అందిచే లోపే ఆ ఇద్ద‌రు మృతి చెందార‌ని తెలుస్తుంది. కాగ మృతి చెందిన వారి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగ మేడారం మ‌హా జాత‌ర‌కు ప్ర‌తి రోజు ల‌క్షల సంఖ్య‌లో భ‌క్తులు వ‌స్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జాత‌ర‌కు ల‌క్షల సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చారు. కాగ ఈ సారి జాత‌ర‌కు కోటి మందికి పైగానే భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది. అయితే భ‌క్తులు ఎక్కువ వ‌స్తున్నా.. ప్ర‌భుత్వం స‌రైనా ఏర్పాట్లు చేయ‌లేద‌ని భ‌క్తులు విమ‌ర్శిస్తున్నారు. అందుకే తొక్కిస‌లాట‌లు అవుతున్నాయ‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version