త్రివిక్రమ్ భుజస్కందాలపై మహేష్ బరువు భాద్యతలు.!

-

మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా మిలియన్ డాలర్ల మార్క్ ను చేరతాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే చుర కత్తుల లాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి తెలుస్తోంది.ఇందులో యంగ్ సంచలన అందం పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు SSMB28 కు ఓ టి టి లో అదిరిపోయే ముందస్తు రేట్ వచ్చినట్లు సమాచారం.అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం 50 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క  దిల్ రాజు ఈ రైట్స్ కోసం రూ.50కోట్లు ఇచ్చి మరీ హక్కులు తీసుకున్నారట. ఇక ఈ సినిమా గురించి త్రివిక్రమ్ చాలా టెన్షన్ పడుతున్నారట. మొదటి సారి పాన్ ఇండియా కావటం, మళ్లీ మహేష్ బాబు వచ్చే సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఉండడం తో కచ్చితంగా హిట్ కొట్టే తీరాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version