పుష్ప ఐటెం సాంగ్ పై ట్రోలింగ్.. స‌మంత సంచ‌ల‌న ట్వీట్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అనేక రికార్డుల‌ను సృష్టిస్తుంది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత డ్యాన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట సోష‌ల్ మీడియా లో ఫుల్ వైర‌ల్ అవుతుంది. అంతే కాకుండా కొంత మంది మీమ్స్ చేస్తున్నారు. అయితే తాజా గా కొంత మంది యువ‌కులు షార్ట్ వీడియోలు చేస్తూ.. ట్రోలింగ్ చేశారు.

అయితే ఆ షార్ట్ వీడియో ట్రోలింగ్ ను స‌మంత ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోకు స్మైలీ ఇమోజీలను కూడా పోస్ట్ చేసింది. కాగ ఆ షార్ట్ వీడియోలో ముగ్గురు యువ‌కులు పుష్ప ఐటెం సాంగ్ ను ట్రోల్ చేశారు. ఎగ్జామ్స్ ఉన్నాయ్ క‌ద‌రా.. అంటే ఎగ్జామ్ లో ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే పాట రాస్తానో అనే భ‌యం ఉందిరా.. అంటూ ఈ సాంగ్ ను ట్రోల్ చేశారు. అయితే ఆ వీడియో ను స‌మంత ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది. కాగ ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో ఊ అంటావా అనే ఐటెం సాంగ్ ఫీవ‌ర్ బాగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version