పబ్ లో చిల్ అవుతున్న సుప్రీత.. శ్రీరెడ్డితో పోల్చుతూ ట్రోల్స్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామర్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది. సురేఖ వాణి కూతురు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.. సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోయినా కూడా తన పాపులారిటీని మాత్రం పూర్తిగా పెంచేసుకుంది..

సోషల్ మీడియాలో తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి గ్లామర్ ట్రీట్ ఇస్తూ వరుస ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో తరచూ సురేఖ వాణి సుప్రీత ఎంతో యాక్టివ్ గా ఉంటూ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు అలాగే పబ్బులు, పార్టీలు అంటూ నిత్యం ఏవో ఒక ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఇకపోతే కొన్నిసార్లు వీరి వ్యవహార శైలిపై నెటిజన్లు ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్స్ ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు కురిపిస్తున్నారు..

తాజాగా సుప్రీత పబ్బులో చిల్ అవుతూ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇవి చూసిన కొంతమంది ఏకంగా సుప్రీత ను శ్రీ రెడ్డితో పోలిస్తూ కామెంట్లు చేస్తున్నారు… సుప్రీత నీ లాగా శ్రీరెడ్డి కూడా ఎంజాయ్ చేయలేదేమో అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు వదిలారు. ముఖ్యంగా ఇందులో పొట్టి దుస్తులు ధరించి ఉండటంతో కొంతమంది ఎప్పటిలాగే కామెంట్లు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version