కరోనా సమయంలో కూడా హుజూరాబాద్‌లో రాజకీయ వేడి తగ్గట్లేదు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలన్నీ హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ టీఆర్ ఎస్ అనుకూల, ఈటల అనుకూల వర్గాల వరుస ప్రెస్‌మీట్లు, ఘర్షణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మంత్రి గంగుల రంగ ప్రవేశంతో హుజూరాబాద్ రెండుగా చీలిపోయింది.
కమలాపూర్ మండల నాయకులు ఆదివారం గంగులను కలిసి పార్టీ వెంటే ఉంటామని ప్రకటించారు. ఇంకోవైపు ఈటల వర్గీయులు, పలువురు సర్పంచులు ప్రెస్‌మీట్ పెట్టి తాము ఈటల వెంటే నడుస్తామని తేల్చి చెబుతున్నారు.
దీంతో హుజూరాబాద్‌లో టీఆర్ ఎస్ కేడర్ రెండుగా చీలిపోతోంది. వీరే కాదు మరికొంత మంది కూడా ఇలాగే కొందరు పార్టీకి అనుకూలంగా మరి కొందరు ఈటలకు రాజఅనుకూలంగా మీటింగులు, ప్రెస్‌మీట్లు పెడుతున్నారు. దీంతో టీఆర్ ఎస్ అధిష్టానం హుజూరాబాద్‌పైనే ఫోకస్ పెట్టింది. ఎలాగైనా కేడర్‌ను మొత్తం లాగేసుకుని ఈటలను ఒంటరి చేయాలని భావిస్తోంది. మరి ఈ కీయాలు ఇంకెటు దారి తీస్తాయో చూడాలి.