ఈటలకు షాక్‌ : ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల నేపథ్యం లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు బీజేపీ పార్టీ అభ్యర్థి పై టీఆరెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొంది.

etala

హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారని… ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేశామని టీఆర్‌ఎస్‌ పేర్కొంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు టీఆరెస్ పార్టీ నేతలు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పై చర్యలు తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆరెస్ నేత గట్టు రామచంద్రరావు. ఎన్నికల సంఘం సమ న్యాయం అమలు చేయాలని కూడా డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version